దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాల్లో ముగిశాయి. ఈ ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైనప్పటి నుంచి సూచీలు ఓ మోస్తరుగా కదలాడాయి. చివర్లో కొనుగోళ్లు ఊపందుకోవడంతో మార్కెట్లు భారీగా లాభపడ్డాయి. ఐటీ, ప్రైవేట్ బ్యాంకు షేర్లలో కొనుగోళ్లు మార్కెట్లకు కలిసివచ్చాయి.ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 566 పాయింట్ల లాభంతో 76,404కి పెరిగింది. నిఫ్టీ 130 పాయింట్లు పెరిగి 23,155కి చేరుకుంది. డాలరుతో రూపాయి మారకం విలువ 25 పైసలు బలపడి రూ. 86.33 వద్ద కొనసాగుతోంది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఇన్ఫోసిస్ (3.16%), టీసీఎస్ (2.97%), టెక్ మహీంద్రా (2.28%), సన్ ఫార్మా (1.78%), బజాజ్ ఫిన్ సర్వ్ (1.63%).
టాప్ లూజర్స్:
టాటా మోటార్స్ (-2.24%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (-1.24%), యాక్సిస్ బ్యాంక్ (-1.02%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-0.76%), ఎన్టీపీసీ (-0.56%).