ఏపీలోని విశాఖ జువైనల్ హోం ఘటనపై కలెక్టర్‌తో మాట్లాడామని మంత్రి సంధ్యారాణి స్పష్టం చేశారు. విశాఖ పోలీసుల సాయంతో ముగ్గురు బాలికలను వారి ఇళ్లకు చేర్చామని గురువారం మంత్రి పేర్కొన్నారు.
బాలికలు బుధవారం చేసిన ఆరోపణలపై విచారణ చేపట్టామని మంత్రి తెలిపారు. బాలికలు రెండు రోజులుగా మందులు వేసుకోలేదన్నారు. బాలికలు హోం సిక్‌తో ఇంటికెళ్లాలనే అలా ప్రవర్తించారని అధికారులు చెప్పారని మంత్రి చెప్పారు.