కర్నూలు జిల్లా ఆలూరు మండలంలోని అరికెర గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. ఫీల్డ్ అసిస్టెంట్ పదవి విషయంలో నెలకొన్న వివాదాలు దారుణ హత్యకు దారితీశాయి. గ్రామానికి చెందిన కురువ బండారి ఈరన్న ఉపాధి పనులు చేయించేందుకు వెళుతుండగా కాపు కాచి ప్రత్యర్థులు.
ఈరన్నను వేట కొడవలితో హతమార్చి అక్కడి నుంచి పారిపోయినట్లు సమాచారం. గుర్తు తెలియని వ్యక్తులు ఆయనపై హత్యకు పదునైన ఆయుధాలు ఉపయోగించినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో గుర్తించారు.