ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నా ఎన్నిక‌ల ప్ర‌చారం అన్నేరావుపేట నుంచే...:. దేవినేని

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Feb 28, 2019, 11:20 PM

2019 అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని అన్నేరావుపేట నుంచి మొదలుపెడతానని, ఎంపీ అభ్యర్థిగా కేసినేని శ్రీనివాస్ (నాని), ఎమ్మెల్యేగా నేను మళ్ళీ మీ దగ్గరకొస్తామని ఏపీ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రకటించారు. గురువారం నాడు రెడ్డిగూడెం మండలంలోని అన్నేరావుపేట గ్రామంలో మంత్రి ఉమా ఇంటింటికీ తేదేపా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన పలు సభలలో ఆయన మాట్లాడుతూ, మైలవరం నియోజకవర్గంలో గ్రామ గ్రామాన ఇంటింటికి వార్డు వార్డు కి జరిగిన అభివృద్ధి పనులను ప్రజలకు తెలియజేయాలని పిలుపునిచ్చారు. ఐదేళ్లు విభజింపబడ్డ నవ్యాంధ్రలో అన్ని రంగాలలో ముందుంచేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పడ్డ కష్టాన్ని ప్రజలకు చెప్పాలని కోరారు.  రాష్ట్రంలో అద్భుతమైన ప్రణాళికలతో దూరదృష్టితో ఎన్నో పనులు చేశామని పటిసీమ, పోలవరం, ప్రజా రాజధాని అమరావతి, పారిశ్రామిక ప్రగతి పింఛన్ల రెట్టింపు పసుపు కుంకుమలు ఎన్నో చేసినట్లు చెప్పారు. మోడీ కేసీఆర్ జగన్ ముగ్గురు కలిసి వచ్చిన తెదేపాను ఏమీ చేయలేరు అని ధీమా వ్యక్తం చేశారు. మోసగించిన కేంద్రంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ధర్మ యుద్ధం చేపట్టాలని, ఐదున్నర కోట్ల మంది ప్రజలు సీఎం ధర్మ యుద్ధానికి మద్దతు పలికారలని చెప్పారు. కోడి కత్తి పార్టీ వాళ్ళను నమ్మొద్దని, జగన్ ఇచ్చే గోడ గడియారాలు బొమ్మ వెనుక కేసిఆర్ దాగున్నట్లు పేర్కొన్నారు. బయటకు వస్తే ఒక రేటు బయటకు రాకపోతే మరో రేటు ఇలా డబ్బు మదంతో వైకాపా వాళ్లు కొనుగోలు కార్యక్రమం చేపట్టినట్లు ఆరోపించారు. కలతలు రేపి గెలవాలన్న దే వైకాపా వ్యూహం అని తెలిపారు. అసెంబ్లీకి వెళ్లకుండా బాధ్యతలు మరచిన వాళ్ళు మళ్ళీ అసెంబ్లీ కి ఓట్లు అడగటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. 23 వేల ఓట్ల మెజారిటీతో ఓడిన వాళ్లు ఇప్పటి వరకు ప్రజలకు మొహం చూపించకుండా ఇప్పుడొచ్చి ఉద్ధరిస్తామంటే నమ్ముతారా ? అని అన్నారు. సొంతింటిని కాపాడుకున్నట్లు మైలవరం నియోజకవర్గాన్ని మైలవరం ప్రజలు కాపాడుకోవాలని, జరిగిన అభివృద్ధిని పల్లెల ప్రశాంతతను శాంతి భద్రతలను, ఇచ్చిన పెన్షన్లను పసుపు కుంకుమలను ఇల్లు ఇళ్ల స్థలాలను రహదారులను గుర్తుపెట్టుకోవాలని ప్రజలను కోరారు._






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa