టిటిడి సారధ్యంలో జరగనున్న వివిధ కార్యక్రమాల గురించి టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్ భక్తులకు వివరించారు. అన్నమయ్య భవనంలో శుక్రవారం జరిగిన డయల్ యువర్ ఈవో కార్యక్రమం తరువాత మీడియాకు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి
హైదరాబాద్‌లో శ్రీవారి ఆలయ విగ్రహప్రతిష్ఠ : హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో రూ.28 కోట్లతో నిర్మించిన శ్రీవారి ఆలయం, శ్రీమహాగణపతి ఆలయాల్లో మార్చి 13న విగ్రహప్రతిష్ఠ జరుగనుంది.
ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయ బ్రహ్మో త్సవాలు : కడప జిల్లా ఒంటిమిట్టలోని శ్రీకోదండరామస్వామివారి ఆలయంలో ఏప్రిల్ 13 నుండి 21వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఇందులో భాగంగా ఏప్రిల్ 18న శ్రీసీతారాముల కల్యాణం జరుగనుంది. ఈ కల్యాణానికి లక్ష మందికిపైగా భక్తులు విచ్చేసేఅవకాశముండడంతో విస్తృతంగా ఏర్పాట్లు చేపడుతున్నాం.
తిరుమలలో ఉత్సవాలు : మార్చి 16 నుండి 20వ తేదీ వరకు 5 రోజుల పాటు శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు జరుగుతాయి.
నూతన శ్రీవారి సేవ భవన సముదాయాలు : తిరుమలలోని నూతనంగా నిర్మించిన శ్రీవారి సేవ భవన సముదాయాలను ఫిబ్రవరి 22వ తేదీ నుండి శ్రీవారి సేవకులకు అందుబాటులోకి తీసుకురావడమైనది.
మొత్తం రూ.96 కోట్ల వ్యయంతో మహిళాసేవకుల కోసం సేవాసదనం-1, పురుష సేవకుల కోసం సేవాసదనం-2 భవనాలను ఆధునిక వసతులతో నిర్మించాం. ఒక్కో భవనంలో దాదాపు 2 వేల మంది బస చేయవచ్చు.
శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు : శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఫిబ్రవరి 24న ప్రారంభమైన వార్షిక బ్రహ్మోత్సవాలు మార్చి 4వ తేదీ వరకు జరుగుతాయి.
తిరుపతిలోని శ్రీకపిలేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు : తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో ఫిబ్రవరి 25న ప్రారంభమైన వార్షిక బ్రహ్మోత్సవాలు మార్చి 6వ తేదీ వరకు జరుగుతాయి.
ప్రత్యేక దర్శనాలు : మార్చి 5, 12వ తేదీల్లో వృద్ధులు, దివ్యాంగులకు దర్శనం కల్పిస్తాం. మార్చి 6, 13వ తేదీల్లో 5 ఏళ్ల లోపు చంటిపిల్లల తల్లిదండ్రులకు దర్శనం కల్పిస్తాం.
దర్శనం : గతేడాది ఫిబ్రవరిలో 17.90 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా ఈ ఏడాది ఫిబ్రవరిలో 18.87 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు.
హుండీ ఆదాయం : శ్రీవారి హుండీ ఆదాయం గతేడాది ఫిబ్రవరిలో రూ.82.27 కోట్లు కాగా, ఈ ఏడాది ఫిబ్రవరిలో రూ.83.11 కోట్లు వచ్చింది.
అన్నప్రసాదం : గతేడాది ఫిబ్రవరిలో 36.04 లక్షల మంది భక్తులకు అన్నప్రసాదాలు అందివ్వగా, ఈ ఏడాది ఫిబ్రవరిలో 42.64 లక్షల మంది భక్తులకు అందజేయడం జరిగింది.
లడ్డూ లు : గతేడాది ఫిబ్రవరిలో 75.18 లక్షల లడ్డూలు అందించగా, ఈ ఏడాది ఫిబ్రవరిలో 82.06 లక్షల లడ్డూలను అందించాం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa