ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వాఘాలో అభినందన్ కు వైద్య పరీక్షల నిర్వహణ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 01, 2019, 05:27 PM

అటారీ: ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ వాఘా సరిహద్దుకు చేరుకున్నాడు. అతన్ని కాసేపట్లో పాకిస్థాన్.. భారత్‌కు అప్పగించనుంది. ప్రస్తుతం పాక్ సరిహద్దు అయిన వాఘాలో అతనికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత అభినందన్.. ఇండియాలో అడుగుపెడతాడు. అటారీలోనూ అతనికి వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత నేరుగా ఢిల్లీకి తరలించే అవకాశం ఉంది. భారత మిలిటరీ స్థావరాలపై దాడికి వచ్చిన పాకిస్థాన్ ఎఫ్ 16 ఫైటర్ జెట్‌ను తన మిగ్ 21లో తరుముతూ వెళ్లిన అభినందన్.. అది కూలిపోవడంతో పారాషూట్ సాయంతో పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో దిగాడు. దీంతో పాక్ ఆర్మీ అతన్ని కస్టడీలోకి తీసుకుంది. అయితే శాంతి చర్యల్లో భాగంగా అభినందన్‌ను తాము విడుదల చేస్తున్నామని గురువారం పాక్ పార్లమెంట్‌లో ఆ దేశ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ ప్రకటించారు. అందులో భాగంగా ఇప్పుడు వాఘా సరిహద్దులో అభిని భారత్‌కు అప్పగించనున్నారు. అత‌నికి ఇండియ‌న్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన బృందం స్వాగ‌తం ప‌ల‌క‌నుంది. అంతేకాదు అభినంద‌న్ త‌ల్లిదండ్రుల‌తోపాటు సుమారు 20 వేల మంది ప్ర‌జ‌లు స‌రిహ‌ద్దుకు త‌ర‌లిరావ‌డం విశేషం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa