భారీ భూకంపం ధాటికి కరేబియన్ సముద్రం అల్లకల్లోలం అయింది. ఆదివారం తెల్లవారుజామున సంభవించిన ఈ భారీ భూకంపం.. హోండురస్‌కు ఉత్తర దిశలో చోటు చేసుకుంది. ఈ భూకంపం తీవ్ర రిక్టర్ స్కేల్‌పై.. 7.6 తీవ్రతగా నమోదైనట్లు అమెరికాకు చెందిన జియోలాజికల్ సర్వే సంస్థ వెల్లడించింది. ఈ భారీ భూకంపం నేపథ్యంలో జియోలాజికల్ సర్వే సంస్థ సునామీ హెచ్చరికలు కూడా జారీ చేసింది. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈ భారీ భూకంపం ప్రభావం కొలంబియా, కెమెన్ ఐలాండ్స్, హోండూరస్, కోస్టారికా, నికరగువా, క్యూబా దేశాలపై కనిపించింది.
శనివారం కరేబియన్ సముద్రంలోని హోండురాస్‌కు ఉత్తరాన కనీసం 7.5 తీవ్రతతో శక్తివంతమైన భూకంపం సంభవించిందని అంతర్జాతీయ పరిశోధనా కేంద్రాలు వెల్లడించాయి. మొదట ఈ భూకంపం తీవ్రతను 6.89గా అంచనా వేశారు. ఆ తర్వాత భూకంపం 10 కిలోమీటర్ల లోతులో ఉందని జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ పేర్కొంది. యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే ప్రకారం భూకంపం తీవ్రత 7.6గా నమోదైందని.. 10 కిలోమీటర్ల లోతులో సంభవించిందని తెలిపింది.
అయితే సముద్రంలో సంభవించిన ఈ భారీ భూకంపం కారణంగా.. భూమిపై ప్రకంపనలు వచ్చాయా లేదా.. ఏదైనా నష్టం జరిగిందా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. 2021లో హైతీలో 7.2 తీవ్రతతో భూకంపం సంభవించిన తర్వాత ఈ ప్రాంతంలో ఇదే అతిపెద్ద భూకంపం అని యూఎస్ నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది. యూఎస్ అట్లాంటిక్ లేదా గల్ఫ్ తీరంలో సునామీ వచ్చే అవకాశాలు ఉన్నాయని అమెరికా జియోలాజికల్ సంస్థ అంచనా వేసింది. భూకంపం తర్వాత ప్యూర్టో రికో, వర్జిన్ దీవులకు కూడా సునామీ హెచ్చరికలు జారీ చేసింది.
![]() |
![]() |