కృష్ణా మిల్క్‌యూనియన్‌నెయ్యి, పెరుగు, పాలు అమ్ముతుంది. బయట ప్రాంతాల్లో నెయ్యి కొనదు. కొంతమంది పనిగట్టుకుని కుట్రతో యూనియన్‌పై ఆరోపణలు చేస్తున్నారు. ఆరోపణలు చేసిన వ్యక్తికి ఏ సందేహం ఉన్నా వచ్చి చూసుకోవచ్చు.’ అని యూనియన్ పాలకవర్గ సభ్యుడు వేమూరి సాయి వెంకటరమణ అన్నారు. శనివారం చిట్టినగర్ పాలఫ్యాక్టరీ సమావేశ హాలులో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. విజయ అనేది అందరికీ సంబంధించిన ఉమ్మడి బ్రాండ్ అని, కృష్ణా మిల్క్‌యూనియన్‌తయారు చేసే ప్రతి ప్యాకెట్‌పై విజయ అని ఉంటుందని, విజయ బ్రాండ్ కింద కృష్ణా మిల్క్‌యూనియన్‌అని ఉంటేనే తాము బాధ్యులమని తెలిపారు. యూనియన్ పేరు లేకుండా విజయ అని మాత్రమే ఉంటే అది తమకు సంబంధం లేదన్నారు. పాడిరైతుగా కవులూరు పాల సొసైటీ అధ్యక్షుడిగా ఉన్న తాడికొండ రమే్‌షబాబు యూనియన్‌పై చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఏ సందేహా లు ఉన్నా సర్వసభ్యసమావేశంతోపాటు, సంస్థ ఎండీతో మాట్లాడాలని, బహిరంగంగా సమావేశాలు పెట్టి ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ఆధారాలు లేకుండా సంస్థపై ఆరోపణలు చేస్తే చట్టపరంగా చర్యలకు వెనకాడేదిలేదని సాయి వెంకటరమణ హెచ్చరించారు. టర్నోవర్ ఆధారంగా రేటు, బోనస్ ఇవ్వరని లాభాల ప్రకారమే ఇస్తారని తెలిపారు. చలసాని ఆంజనేయులు హయాంలో యూనియన్ లాభాల బాట పట్టిందన్నారు. రూ.142 కోట్లు లాభాల ద్వారానే రైతులకు బోన్‌సలను ఇస్తున్నామన్నారు. లావాదేవీలు పూర్తిగా బ్యాంకు ద్వారా, కేటాయింపులు టెండర్ల ద్వారా చేస్తామన్నారు. వీరవల్లి ప్లాంట్‌లో నాలుగు బోర్లు ఉన్నాయని, నీటి కొరత లేదన్నారు. ఫీడ్‌ప్లాంట్ కోసం జరిపిన కొనుగో లు జానకిరామయ్య హయంలోనే జరిగిందన్నారు. టెండర్ పిలిస్తే రూ. 25 లక్షలు డిపాజిట్ వదిలేసి ఆ కాంట్రాక్టర్ వెళ్లిపోయాడన్నారు. నష్టం లో నడిచే ప్రాజెక్టును అనవసరంగా నడుపుతున్నామనే భావన యూనియన్‌కు కలిగిందన్నారు. పాలప్రాసెసింగ్ యూనిట్ అనుకుని నిర్మాణం చేశామని తెలిపారు. అన్ని నిర్మాణాలు టెండర్ ప్రక్రియ ద్వారానే జరిగాయని, ట్రాన్స్‌పోర్టు కూడా పాత వారే చూసుకుంటున్నారని, రెండేళ్లకు ఒకసారి టెండర్ల ప్రక్రియలో పాల్గొని వారే దక్కించుకుంటున్నారని తెలిపారు. కార్యక్రమంలో ఎండీ కొల్లి ఈశ్వరబాబు, పాలకవర్గ సభ్యులు దాసరి వెంకట బాలవర్థనరావు, పల్లగాని కొండలరావు, అర్జా నగేష్ తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa