ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఫిబ్రవరి 24 నుంచి జరగనున్నాయి. ఈ సమావేశాల్లోనే బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. అసెంబ్లీ సమావేశాల తొలి రోజున రాష్ట్ర గవర్నర్ ఉభయసభలనుద్దేశించి ప్రసంగించనున్నారు. బీఏసీ సమావేశం అనంతరం, ఈసారి అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు జరుగుతాయన్న అంశంపై స్పష్టత రానుంది. కాగా, ఈసారి వైసీపీ అధినేత జగన్ తో పాటు, ఆ పార్టీకి చెందిన ఇతర ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీకి హాజరవుతారని తెలుస్తోంది. ఎందుకంటే వరుసగా 60 పనిదినాల పాటు అసెంబ్లీకి హాజరుకాకపోతే, సదరు ఎమ్మెల్యేపై అనర్హత వేటు పడుతుందని ఇటీవలే ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఓ ప్రెస్ మీట్ లో చెప్పారు. ఆ లెక్కన జగన్ కు అనర్హత ముప్పు పొంచి ఉందని సూచనప్రాయంగా వెల్లడించారు. ఈ నేపథ్యంలో, శాసనసభ సభ్యత్వాలు రద్దయ్యే ప్రమాదం ఉండడంతో జగన్ సహా వైసీపీ ఎమ్మెల్యేలు ఒక రోజు అసెంబ్లీ సమావేశాలకు హాజరై వెళ్లిపోవాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa