అద్భుత విజయంతో భారత్ మూడో సారి ఛాంపియన్స్ ట్రోఫీని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ టోర్నీ ద్వారా భారత ఆటగాళ్లకు భారీ ప్రైజ్ మనీ లభించింది. ఈ క్రమంలో టీమిండియా ఎంత ప్రైజ్ మనీ గెలుచుకుందో ఐసీసీ రివీల్ చేసింది. విజేతగా నిలిచిన భారత జట్టు రూ.19.46 కోట్లు దక్కించుకోగా ప్రతి భారతీయ ఆటగాడికి రూ.కోటికు పైగా లభించినట్లు తెలిపింది.ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ప్రైజ్ మనీ పంపిణీ (కోట్లలో):
ఇండియా (విజేత) – రూ.19.46 కోట్లు
న్యూజిలాండ్ (రన్నరప్) – రూ.9.73 కోట్లు
ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా (సెమీ-ఫైనలిస్టులు) – రూ.4.86 కోట్లు
ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ – రూ.3.04 కోట్లు
పాకిస్తాన్, ఇంగ్లాండ్ – రూ.1.22 కోట్లు
ప్రతి గ్రూప్ దశ మ్యాచ్ విజయానికి ప్రైజ్ మనీ – రూ.29.53 లక్షలు
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 అవార్డులు:
ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ – రచిన్ రవీంద్ర
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు – రోహిత్ శర్మ
గోల్డెన్ బాల్ అవార్డు – మాట్ హెన్రీ
గోల్డెన్ బ్యాట్ అవార్డు – రచిన్ రవీంద్ర
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa