ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాజకీయాల్లోకి సోనియా గాంధీ అల్లుడు

national |  Suryaa Desk  | Published : Sun, Mar 10, 2019, 07:05 PM

ప్రియాంక గాంధీ ఇటీవల ప్రత్యేక్ష రాజకీయాల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీలో ఆమెకు ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చి కీలక బాధ్యతలు అప్పజెప్పింది. ఈ నేపథ్యంలో ఆమె భర్త రాబర్ట్ వాద్రా కూడా త్వరలోనే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నారనే ప్రచారానికి బలం చేకూరుతోంది. ఈ అంశంపై రాబర్ట్ వాద్రా సానుకూలంగా స్పందించారు. ఈ విషయంపై పలుసార్లు ఫేస్‌బుక్‌ ద్వారా కూడా స్పందించారు. ఆయన ఉత్తర్‌ప్రదేశ్‌లోని మొరాదాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. కాంగ్రెస్‌ కార్యకర్తలు ఆయనకు సంబంధించిన పోస్టర్లను కూడా ఏర్పాటు చేసి జోరుగా ప్రచారం చేస్తుండడంతో ఈ విషయంపై వాద్రా మరోసారి స్పందించారు. ఈ పోస్టర్లను తన ఫేస్‌బుక్‌ అకౌంట్‌లో పోస్ట్ చేస్తూ కార్యకర్తలు చూపుతున్న అభిమానానికి హర్షం వ్యక్తం చేశారు. అతిపెద్ద వేదికపై నుంచి తాను ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నానని తెలిపాడు. కానీ తనపై ఉన్న అసత్య ఆర్థిక నేరగాడనే ఆరోపణలు తొలిగిపోవాల్సి ఉందని తెలిపారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa