దేశ ప్రజలు.. రాజకీయ నాయకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ మరికొన్ని నిమిషాల్లో వెలువడనుంది. లోక్‌సభతో పాటు ఒడిశా, ఆంధ్రప్రదేశ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల శాసనసభ ఎన్నికలను సాయంత్రం 5 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేయనుంది. మరోవైపు, నోటిఫికేషన్ విడుదలవుతున్న సమయం గురించి కొందరు నేతల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది.
ఎన్నికల సంఘం ప్రణాళిక ప్రకారం ఈరోజు సాయంత్రం 5 గంటలకు లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తారు. కానీ ఈరోజు సాయంత్రం 4:55 గంటల నుంచి 6:24 మధ్య రాహుకాలం ఉండడంతో ముహూర్తాలను నమ్మే నేతలు కొందరు ఆందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా దక్షిణాది నేతలు వాస్తు, జ్యోతిష్యం, పంచాగాన్ని ఎంతో నమ్మకంగా పాటిస్తారనే సంగతి తెలిసిందే. శాసనసభను రద్దు చేయడానికి, ఎన్నికల ప్రచారానికి, రెండోసారి సీఎంగా ప్రమాణస్వీకారానికి, మంత్రి మండలి విస్తరణకు ఇలా అనేక అంశాల్లో కేసీఆర్ గ్రహబలాల ఆధారంగానే ముందడుగు వేశారు. కేసీఆర్‌తో పాటు దేవేగౌడ, చంద్రబాబు, యెడ్యూరప్ప మొదలగు సౌత్ లీడర్స్ జాతకాలపై, ముహుర్తాలపై నమ్మకం ఉంచుతారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa