పర్చూరు సమస్య పరిష్కారమయ్యింది. ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా కల్పించుకుని ఇరువర్గాలతో మాట్లాడడంతో వివాదం సద్దుమణిగింది. రాజధానిలో సీఎం వద్ద జరిగిన సమావేశంతో ఇరువర్గాల మధ్య విభేదాలు తాత్కాలికంగా సద్దుమణిగాయి. స్థానికంగా సమావేశం ఏర్పాటు చేసి, మాట్లాడుకుని సమస్యలను పూర్తిగా పరిష్కరించుకోనున్నారు. ముందుగా అసమ్మతి నాయకులతోనూ, ఎమ్మెల్యే సాంబశివరావుతోనూ టీడీపీ ముఖ్యులు విడివిడిగా మాట్లాడారు.
యనమల రామకృష్ణుడు సహా, ఎమ్మెల్సీ కరణం బలరాం తదితరులు అభిప్రాయాలను సేకరించారు. అసమ్మతి నాయకులు ఏడుగురు హాజరయ్యారు. వీరు విడివిడిగా బృందంతో మాట్లాడారు.ఎమ్మెల్యే వైఖరి, ఆయన గత కొద్దికాలంగా చేసిన పనులు, తమ అసంతృప్తికి కారణాలు, పార్టీకి జరుగుతున్న నష్టాలను వివరించారు. తరువాత ఎమ్మెల్యే సాంబశివరావు కూడా ఈ బృందం ముందు హాజరై తన అభిప్రాయాలను చెప్పారు. ఈ ఇరువర్గాల భేటీలు మూడు గంటల పాటు జరిగాయి. అన్ని విషయాలను పూసగుచ్చినట్లు మాట్లాడారు. ఇరు వాదనలను ఆలకించిన బృందం సభ్యులు ఈ నివేదికను సీఎం చంద్రబాబుకు అందించారు. అనంతరం ఆయన వీరిని పిలిపించారు. ఈ సందర్భంగా ఇరువర్గాలకు సీఎం ముఖ్య సూచనలు చేశారు. మీ రెండు వర్గాలు కలిసి కష్టపడి పనిచేస్తే మంచి ఫలితం వస్తుంది. మళ్లీ మాట్లాడుకోండి, చిన్న చిన్న సమస్యలు పరిష్కరించుకోండి అని చంద్రబాబు రెండు వర్గాలకూ సూచించారు.ఈ భేటీపై అటు ఎమ్మెల్యే, ఇటు నాయకులు కూడా సంతృప్తి వ్యక్తం చేశారు. పర్చూరులో ఈ సారి దగ్గుబాటి వెంకటేశ్వరరావు కుమారుడు పోటీ చేస్తున్నారు. అయితే.. ఆయన నామినేషన్ పై ఇంకా గందరగోళం ఉంది.
ఆయనకు అమెరికా పౌరసత్వం ఉన్న కారణంగా… పోటీ కి అర్హుడా కాదా అ్నదానిపై క్లారిటీ రాలేదు.కానీ టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి మాత్రం పూర్తి స్థాయిలో రెడీ అయ్యారు. పర్చూరులో దగ్గుబాటి వెంకటేశ్వరరావు తీరుపై ఇప్పటికే ప్రజా వ్యతిరేకత ఉంది. గత ఐదేళ్ల కాలంలో ఎప్పుడూ ఆయన అటు వైపు రాలేదు. ఇప్పుడు టిక్కెట్ వచ్చే సరికి రెడీ అయ్యారు. ఈ పరిస్థితి అక్కడ వైసీపీ నేతల్లోనే అసంతృప్తి వ్యక్తమవుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa