కట్టప్ప తెలుగు చిత్ర సీమ అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు. నీతికి నిజాయితీకి నిబద్దతకు మారుపేరుగా బాహుబలి చిత్రంలో కట్టప్ప వ్యవహరిస్తూంటాడు. ఇదిగో సరిగ్గా ఇట్లాంటి వ్యక్తిత్వానికే తెలుగుదేశం అధిష్టానం ఫిదా అయ్యిందట. సీట్ల కేటాయింపు విషయంలో ఆ స్థానంపై ఎ నిర్ణయానికి వచ్చారట. కష్టకాలంలో పార్టీకి నమ్మిన బంటులా ఉంటూ.. సేవలందించిన సదరు నేత పట్ల సానుకూలంగా ఉన్నారట. సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో అధికార తెలుగుదేశం పార్టీ సీట్ల సర్ధుబాట్లను వేగవంతం చేసింది. గెలుపు గుర్రాలకు అసెంబ్లీ స్ధానాలను కేటాయించేందుకు అధినేత చంద్రబాబు సన్నధ్దమయ్యారు. అయితే తాము బలంగా ఉన్న ఉభయగోదావరి జిల్లాలపై తెలుగుదేశం పార్టీ గట్టి ఆశలే పెట్టుకుంది. గత ఎన్నికల్లో ఇక్కడ టీడీపీకి ప్రజలు బ్రహ్మరధం పట్టిన నేపధ్యంలో మరోమారు గోదావరి జిల్లాల ప్రజలు తమవైపే ఉన్నారని చాటేందుకు రెడి అయింది. ప్రతి నియోజక వర్గంపై ప్రత్యేక ద్రుష్టి సారిస్తు సీట్ల కేటాయింపులు జరుపుతున్నారు అధినేత చంద్రబాబు.
ఇదిలా ఉంటే అమలాపురం నియెజక వర్గానికి సంభందించి విశ్వసనీయతకు, విధేయతకు పెద్దపీట వేసినట్లు సమాచారం అందుతోంది. ప్రస్తుతం ఇక్కడినుండి అయితాబత్తుల ఆనందరావు ఎమ్మెల్యేగా ఉన్నారు. పార్టీలో సామాన్య కార్యకర్త హోదానుండి సర్పంచిగా ప్రాతినిధ్యం వహించిన ఆనందరావు తన విధేయత కలుపుగోలు తనంతో అంచెలంచెలుగా ఎదిగి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. నిరాడంబరత, కలుపుగోలు తనం అన్ని వర్గాలను సమప్రాధాన్యత ఇవ్వడం వంటి సులక్ష్యణాలు అయితాబత్తుల సొంతం. షెడ్యూల్ కులాలకు చెందిన నేతగా ఆయా వర్గాలుకు అభ్యున్నతికి కృషిచేస్తున్నారయన.
ఇదంతా ఒక ఎత్తైతే కష్టకాలంలో తెలుగుదేశం పార్టీకి వెన్నంటి నడిచారు అయితా ఆనందరావు. 10 ఏళ్ళపాటు పార్టీ అధికారానికి దూరమై ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ అమలాపురంలో తెలుగు జెండాను పదిలపరిచారు. కొన్ని సందర్భాల్లో పార్టీ తీసుకున్న నిర్ణయాలు తనని వ్యక్తిగతంగా బాధించినా నమ్మిన సిద్దాంతంకోసం అధినేత నిర్ణయాలకు కట్టుబడి ఉన్నారయన. తన రాజకీయ గురువు చినరాజప్ప నేత్రుత్వంలో అన్నివర్గాల వారిని కలుపుకుపోతూ నిబద్దతతో కూడిన రాజకీయ నాయకుడిగా ఎదిగారు ఆనందరావు. కోనసీమ ప్రాంతంలో మాజీ లోక్ సభా స్పీకర్ జీఎంసీ బాలయోగి తర్వాత అంతటి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. వివాధ రహితుడిగా. అభివృద్దికి కామికుడిగా. మంచి వక్తగా బెస్ట్ ఎమ్మెల్యే అవార్డ్ అందుకున్నారు ఆనందరావు.
ఇదిలా ఉంటే పార్టీకి ఆనందరావు చేసిన సేవలు గుర్తించిన అధినేత 2009,2014 లో అసెంబ్లీ సీటు కేటాయించారు. కాగా ఇప్పుడు మరోమారు అమలాపురం అసెంబ్లీ స్ధానానికి అయితాబత్తుల ఆనందరావుకే సీటు కేటాయించనున్నట్లు సమాచారం. అవినీతి లేకపోవడం అభివృద్దికి పెద్ద పీట వేయడం వివాదాలకు దూరంగా.. పార్టీకి నమ్మిన బంటుల వ్యవహరించిన తీరు ప్రాతిపదికన ఆనందరావుకు సీటు కేటాయింపు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా నియోజకవర్గంలో జరిగిన అభివృద్దిపనుల పట్ల కూడా ప్రజలు సంతోషంగా ఉన్నట్లు రిపోర్ట్ లు రావడం. జిల్లాలోని చినరాజప్ప, మెట్ల వర్గాలు సంపూర్ణ మద్దతు తెలియజేయడం నేపధ్యంలో ఆయనకు సీటు కేటాయింపు లాంఛనం కానున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా అయితాబత్తుల ఆనందరావు మరోమారు అమలాపురం బరిలో ప్రత్యర్దులకు సవాల్ విసిరే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa