దేశంలో 7 ఫేజుల్లో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసింది కేంద్ర ఎన్నికల కమిషన్. ఏప్రిల్ 11న రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. దేశంలోని వివిధ రాష్ట్రాల నియోజకవర్గాల సంఖ్య, రాష్ట్రాల్లోని పరిస్థితులను బట్టి ఏడు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఏయే రాష్ట్రాల్లో ఏయే దశలలో, ఎన్ని నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతుందో క్రింది విధంగా వున్నాయి. ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఒడిశా రాష్ట్ర అసెంబ్లీలకు కూడా అదే సమయంలో ఎన్నికలు జరుగుతాయి.
ఫేజ్ 1: ఏపీ 25, తెలంగాణ 17, మహారాష్ట్ర 7, యూపీ 8, అరుణా చల్ ప్రదేశ్ 2, అసోం 5, బీహార్ 4, చత్తీస్ గఢ్ 1, జమ్ముకశ్మీర్ 2, మణిపూర్ 1, మేఘాలయ 2, మిజోరాం 1, నాగాలాండ్ 1, ఒడిశా 4, సిక్కిం 1, త్రిపుర 1, ఉత్తరాఖండ్ 5, పశ్చిమబెంగాల్ 2, అండమాన్ నికోబార్ 1, లక్షద్వీప్ 1. మొత్తం నియోజకవర్గాల సంఖ్య 91.
ఫేజ్ 2: తమిళనాడు 39, కర్ణాటక 14, మహారాష్ట్ర 10, బీహార్ 5, అసోం 5, చత్తీస్ గఢ్ 3, జమ్ముకశ్మీర్ 2, మణిపూర్ 1, ఒడిశా 5, త్రిపుర 1, యూపీ 8, పశ్చిమబెంగాల్ 3, పుదుచ్చేరి 1. మొత్తం నియోజకవర్గాల సంఖ్య 97 .
ఫేజ్ 3: గుజరాత్ 26, కేరళ 20, మహారాష్ట్ర 14, కర్ణాటక 14, యూపీ 10, చత్తీస్ గఢ్ 7, ఒడిశా 6, పశ్చిమబెంగాల్ 5, అసోం 4, బిహార్ 5, గోవా 2, జమ్ముకశ్మీర్ 1, దాద్రా మరియు నగర్ హవేలీ 1, డమన్ మరియు డయూ 1. మొత్తం నియోజకవర్గాల సంఖ్య 115.
ఫేజ్ 4 :మహారాష్ట్ర 17, రాజస్థాన్ 13, యూపీ 13, పశ్చిమబెంగాల్ 8, మధ్యప్రదేశ్ 6, ఒడిశా 6, బీహార్ 5, జార్ఖండ్ 3, జమ్ముకశ్మీర్ 1. మొత్తం నియోజకవర్గాల సంఖ్య 71.
ఫేజ్ 5 :ఉత్తరప్రదేశ్ 14, రాజస్థాన్ 12, మధ్యప్రదేశ్ 7, పశ్చిమబెంగాల్ 7, బీహార్ 5, జమ్ముకశ్మీర్ 2. మొత్తం నియోజకవర్గాల సంఖ్య 51.
ఫేజ్ 6 :ఉత్తరప్రదేశ్ 13, పంజాబ్ 13, పశ్చిమబెంగాల్ 9, మధ్యప్రదేశ్ 8, బీహార్ 8, హిమాచల్ ప్రదేశ్ 4, జార్ఖండ్ 3, చండీగఢ్ 1. మొత్తం నియోజకవర్గాల సంఖ్య 59.
ఫేజ్ 7 :ఉత్తరప్రదేశ్ 13, పంజాబ్ 13, పశ్చిమబెంగాల్ 9, బిహార్ 8, మధ్యప్రదేశ్ 8, హిమాచల్ ప్రదేశ్ 4, జార్ఖండ్ 3, చండీగఢ్ 1. మొత్తం నియోజకవర్గాల సంఖ్య 59.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa