ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బిజెపిపై శివసేన విమర్శలు

national |  Suryaa Desk  | Published : Mon, Mar 11, 2019, 03:11 PM

2019 లోక్‌సభ ఎన్నికల కోసం ఎన్నికల కమీషన్‌ షెడ్యూల్‌ విడుదల చేసిన మరుసటి రోజే మిత్రపక్షం అధికారపక్షంపై విరుచుకుపడింది. అమర జవాన్ల త్యాగాలను చూపించి ఓట్టు అడిగేవారు దోషుల కిందే లెక్క అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. శివసేన అధికార పత్రిక సామ్నా సంపాదకీయంలో బిజెపిపై ధ్వజమెత్తింది. రాజకీయ ప్రత్యర్దులను దేశద్రోహులు అంటూ నిందించడం బాధ్యతా రాహిత్యం. ఇది భావ ప్రకటనా స్వేచ్ఛను ఉల్లంఘించడమే. పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా పాక్‌పై జరిపిన వైమానికి దాడుల ఘనతను సైన్యానికి కాకుండా తమ ఖాతాలో వేసుకునే రాజకీయ నాయకుల సంఖ్య పెరిగిపోతుందని శివసేన దుయ్యబట్టింది. చాలామంది బిజెపి నేతలు సైనిక దుస్తులు ధరించి ర్యాలీల్లో పాల్గొంటున్నారు. ఢిల్లీ ఎంపి మనోజ్‌ తివారి ఇటీవల సైనిక దుస్తుల్లో వెళ్లి, బిజెపికి ఓట్లేయాలంటూ అడిగారు. ఇలాంటి చర్యల కారణంగా రాజకీయ ప్రయోజనాల కోసమే వైమానికి దాడులు చేశారంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు నిజమేనన్న భావన కలుగుతుంది. బిజెపి, శివసేన పరస్పరం కత్తులు దూసుకుంటున్నప్పటికీ ఎన్నికల్లో కలిసి పోటీచేయాలని ఇటీవల నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. మహారాష్ట్రలోని 23 లోక్‌సభ స్థానాల్లో శివసేన, 25 స్థానాల్లో బిజెపి పోటీ చేయనున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa