మా వ్యూహ రచనతో విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పీఠాన్ని కాపాడుకుంటామని వైయస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు. కూటమి నేతలుప్రలోభాపెట్టి, భయపెట్టి వైయస్ఆర్సీపీ కార్పొరేటర్లను తమ వైపు తిప్పుకుంటున్నారని ఆక్షేపించారు. 30, 40 మందితో మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవాలని కూటమి భావిస్తుందని మండిపడ్డారు. బలం లేకపోయినా అవిశ్వాస తీర్మానం ఇవ్వడం వెనక ఆంతర్యం ఏమిటని ఆయన ప్రశ్నించారు. మా రాజకీయం మేం చేస్తామని, మా వారిని మేం కాపాడుకుంటామని వెల్లడించారు.
![]() |
![]() |