రాష్ట్రంలో బ్రాయిలర్ కోళ్ల ఫారాలు 3వేలు, గుడ్లు ఉత్పత్తి చేసే ఫారాలు 1,200 ఉన్నాయి. మొత్తం పౌల్ర్టీ ఫారాల్లో 6 కోట్ల దాకా కోళ్లు ఉన్నాయి. రోజుకు సుమారు 4.5కోట్ల గుడ్లు ఉత్పత్తవుతున్నాయి. కానీ రెండు నెలలుగా బర్డ్‌ఫ్లూపై భయంతో గుడ్లు, చికెన్ వినియోగం తగ్గింది. వాస్తవానికి అమెరికాలో బర్డ్‌ఫ్లూ వస్తే.. మార్కెట్‌లో ఉన్న గుడ్లు, చికెన్‌కు డిమాండ్ వచ్చింది. కానీ భారత్‌లో బర్డ్ ఫ్లూ నేపథ్యంలో చికెన్ షాపుల్ని బంద్ చేయించడంతో ప్రజల్లో అపోహలు తలెత్తాయి. బర్డ్‌ఫ్లూ వల్ల లక్షలాది కోళ్లు మృత్యువాత పడినా.. మనుషులకు ఏ ప్రమాదం లేదన్న విషయంపై అధికారులు ప్రచారం చేసినా ప్రజల్లో భయం పోలేదు. పౌల్ర్టీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో పలు నగరాల్లో చికెన్ మేళాలు నిర్వహిస్తే.. ఉచితంగా ఆరగించడానికి చికెన్ ప్రియులు పోటెత్తారు. ఓ వైపు బర్డ్‌ఫ్లూతో కోళ్లు చనిపోగా, మరోవైపు చికెన్, గుడ్లు అమ్మకాలు, ఎగుమతులు మందగించాయి. దీంతో పౌల్ర్టీలకు రూ.లక్షల్లో నష్టాలొచ్చాయి. ఎండలకు కోళ్లు చనిపోవడం, గుడ్లు ఉత్పత్తి తగ్గడం సహజం. కానీ రానున్న 80 రోజులు వేసవి ప్రభావంతో పౌల్ర్టీలు మూతపడే అవకాశం ఉంది. పాఠశాలలకు కోడిగుడ్ల సరఫరా నిలిచిపోనున్నది. ఇవే పరిస్థితులు ఇంకొన్నాళ్లు కొనసాగితే.. పౌల్ర్టీ పరిశ్రమ దివాలా తీసే ప్రమాదం పొంచి ఉందని యజమానులు ఆందోళన చెందుతున్నారు.
![]() |
![]() |