ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మంత్రుల పోటీపై టీడీపీలో ఉత్కంఠ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 14, 2019, 12:26 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రులు, ముఖ్య నేతల పోటీపై టీడీపీలో ఉత్కంఠ నెలకొంది. మంత్రులు పోటీ చేసే స్థానాలపై గురువారం కూడా టీడీపీలో సస్పెన్స్‌ కొనసాగుతోంది. ఇంత వరకు గంటా శ్రీనివాస్, శిద్దా రాఘవరావు, పరిటాల సునీత, జవహర్‌ పోటీ పై స్పష్టత రాలేదు. సత్తెనపల్లి నాది అంటూ.. కోడెల శివప్రసాదరావు ప్రకటించారు. కోడెల మాకు వద్దు అంటూ.. సత్తెనపల్లిలో అసమ్మతి ఆందోళన కొనసాగుతోంది. తిరువూరుకు మంత్రి జవహర్‌, కొవ్వూరుకు అనిత పేర్లు సూచించనున్నట్లు సమాచారం. 15 స్థానాల్లో సంక్షిప్తంగా సీట్ల ప్రకటన మారింది. దర్శి టికెట్‌ శిద్ధాకు ఇవ్వాలని అతని అనుచరులు డిమాండ్‌ చేస్తున్నారు. దర్శి నుండి వందలాదిగా శిద్ధా వర్గం సిఎం నివాసానికి బయలుదేరింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa