ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నామినేష‌న్ లేట‌వుతోంద‌ని జనసేన అభ్యర్థి ధర్నా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 23, 2019, 01:18 AM

జనసేన అభ్యర్ధి మైలపల్లి శ్రీనివాసరావు జనసేన కార్యకర్తలతో కలిసి విజయనగరం తహశీల్దారు కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. తాను సమయానికి వచ్చినప్పటికీ.. తన నామినేషన్‌ ను కాదని, బొత్స సత్యనారాయణ, ఆయన సతీమణి బొత్స ఝాన్సీ లక్ష్మి ల నామినేషన్‌ లను ముందుగా తీసుకున్నారని శ్రీనివాసరావు ఆగ్రహాన్ని వ్యక్తపరిచారు. తమ నేత సమయాని కంటే ముందుగానే వచ్చినప్పటికీ నామినేషన్‌ పత్రాలు తీసుకోలేదంటూ జనసేన కార్యకర్తలు మండిపడ్డారు. ఈ విషయమై జనసేన అభ్యర్థి శ్రీనివాసరావు ఆర్‌ఒ ను ప్రశ్నించారు. నామినేషన్‌ పత్రాలు తీసుకునే వరకూ కదలేది లేదని కార్యాలయం ముందు బైఠాయించి నిరసన చేపట్టారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa