వైఎస్ఆర్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. ఆయన శుక్రవారం తన నామినేషన్ దాఖలు చేశారు. దాంట్లో తన ఆస్తుల వివరాలను వెల్లడించారు. ఆ అఫిడవిట్‌లో తన ఆస్తులు 375 కోట్లుగా ఉన్నట్లు జగన్ పేర్కొన్నారు. తనకు స్వంత కారు లేదని కూడా ఆ అఫిడవిట్‌లో తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లాలో ఉన్న పులివెందుల నుంచి జగన్ పోటీ చేస్తున్నారు. తన చరాస్థులు 339 కోట్లు కాగా, తన స్థిరాస్తులు 35 కోట్లు అని పేర్కొన్నారు. 2014లో నామినేషన్ వేసినప్పుడు జగన్ తన ఆస్థి 343 కోట్లు అని పేర్కొన్నారు. జగన్ భార్య వైఎస్ భారతీ రెడ్డి ఓ వ్యాపారవేత్త. ఆమె ఆస్తులు 124 కోట్లుగా ఉంది. 2014లో ఆమె ఆస్తి 71 కోట్లు ఉండే. భారతి ఆస్తుల్లో 92 కోట్లు చరాస్తులు కాగా, 31 కోట్లు స్థిరాస్తిగా ఉంది. ఇద్దరు కూతుళ్లపై 11 కోట్ల ఆస్తులు ఉన్నాయి. తనకు స్వంత కారు లేదని జగన్ తన ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఇతరులకు చెందిన నాలుగు బుల్లెట్ ప్రూఫ్ కార్లు మాత్రం తన పేరు మీద రిజిస్టర్ అయ్యాయని తెలిపారు. 2017-18 సంవత్సరంలో జగన్ తన ఆదాయాన్ని 25.89 కోట్లుగా చూపించారు. అంతకముందు సంవత్సరంలో ఆ ఆదాయం 2.90 కోట్లు మాత్రమే ఉన్నది. 8.42 కోట్లు విలువైన వ్యవసాయ భూమి జగన్ పేరిట ఉన్నది. 14.46 కోట్ల విలువైన కమర్షియల్ బిల్డింగ్, 12 కోట్ల విలువైన రెసిడెన్షియల్ బిల్డింగ్‌లో హైదరాబాద్‌లో ఉన్ఆనయి. జగన్‌పై మొత్తం 31 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. దీంట్లో సీబీఐ, ఈడీ, మనీల్యాండరింగ్ కేసులో కూడా ఉన్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa