AP: భూ వివాదం కారణంగా బాపట్ల జిల్లా ఎస్పీ కార్యాలయం ఎదుట ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. నిజాంపట్నం మండలం హారిస్ పేటకు చెందిన కె.శ్రీనివాసరావు తన 2 ఎకరాల రొయ్యల చెరువుల విషయంలో మోపిదేవి పోతురాజు అనే వ్యక్తి తనను మోసం చేసి భూమి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఆరోపించారు. ఈ మేరకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో తనకు న్యాయం చేయాలంటూ శ్రీనివాసరావు భార్య పిల్లలతో సహా పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకునే ప్రయత్నం చేశారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa