ఫిట్‌గా ఉండాలనుకోవడంలో తప్పులేదు. దీనికోసమే ఎక్కువగా వర్కౌట్ చేస్తుంటారు. అందులో కొన్ని ఇంట్లో కూడా చేయొచ్చు. ఇంట్లో చేసినప్పటికీ మనం మంచి బెనిఫిట్స్‌ని పొందుతాం. అందులో సిటప్స్ కూడా ఉంటాయి. ఈ కోర్ వర్కౌట్ కారణంగా మనకి కొన్ని లాభాలున్నాయి. కండరాలు బలంగా మారడం, బ్యాక్ పెయిన్ తగ్గడం వంటివి ఏమైనా ఉన్నాయంటే అది సిటప్స్ కారణంగానే. ముఖ్యంగా, కోర్ని బలంగా చేయడంలో ఈ వర్కౌట్ బాగా హెల్ప్ చేస్తుంది. రెగ్యులర్ డెస్క్ జాబ్స్ చేసేవారు చేస్తే చాలా వరకూ నడుము, వెన్నునొప్పి తగ్గుతుంది. ఇంకేం లాభాలున్నాయి. ఈ వర్కౌట్‌ని ఎలా చేయాలో తెలుసుకోండి.
ఫ్లెక్సిబిలిటీ
నేటి కాలంలో చాలా మంది డెస్క్ జాబ్స్ చేస్తున్నారు. ఈ కారణంగా వారికి ఎలాంటి వర్కౌట్స్ ఉండడం లేదు, ఏ పనులు చేయట్లేదు. అలాంటి వారు సిటప్స్ చేస్తే ఫ్లెక్సిబిలిటీ పెరిగి దీంతో కండరాలు పట్టేయడం, ఏకాగ్రత తగ్గడం, ఒత్తిడి, స్ట్రెంథ్ తగ్గడం వంటివి ఉండవు. బలమైన, దృఢమైన కోర్ కారణంగా మీ తుంటి, వెన్నెముక, భుజాలు బలంగా మారతాయి. పోశ్చర్ మెరుగ్గా మారుతుంది. కొంతమందికి వీపు వంగినట్లుగా ఉండడం ఉంటుంది. అలాంటివారు ఈ వర్కౌట్ చేస్తే సరైన విధంగా ఫిట్‌గా కనిపిస్తారు.
బ్యాలెన్స్
మనం సరిగ్గా నిలబడాలన్నా నిల్చొని ఏవైనా పనులు చేయాలన్నా బాడీ బ్యాలెన్స్డ్గా ఉండడం చాలా ముఖ్యం. దీనికోసం కోర్ స్ట్రెంథ్ పెరగాలి. అయితే, మనం సిటప్స్ చేస్తే కోర్ బలంగా మారుతుంది. కటి, నడుము, తుంటి కండరాలకి ఇవి చాలా మంచిది. బ్యాలెన్సింగ్‌గా ఉంటుంది. దీంతో త్వరగా పడిపోవడం, గాయలవ్వడం వంటివి జరగవు. థైస్ బలంగా మారి తొడల భాగంలో ఉన్న కొలెస్ట్రాల్ కరిగి తొడలు తగ్గుతాయి. తొడలు లావుగా ఉన్నవారు ఈ వర్కౌట్ చేసే మంచి రిజల్ట్ ఉంటుంది.
మజిల్ మాస్‌కి
సిటప్స్ చేయడం వల్ల కడుపు, తుంటి కండరాలు బలంగా మారతాయి. సిటప్స్ పనితీరు కండరాలని మెరుగ్గా చేస్తాయి. వృద్ధాప్యం కారణంగా వచ్చే కండరాల నొప్పుల్ని దూరం చేసి బలంగా మారుస్తాయి. అంతేకాకుండా మంచి పోశ్చర్ ఉండేలా చేస్తుంది. వీటి వల్ల త్వరగా అలసిపోరు. రెగ్యులర్‌గా జిమ్ చేసేవారు మజిల్స్‌ని పెంచుకోవాలనుకుంటారు. అలాంటి వారికి ఈ వర్కౌట్ మంచి లాభాలని అందిస్తుంది.
ఎలా చేయాలి
ముందుగా వెల్లకిలా పడుకోండి.
మోకాళ్లని వంచండి.
పాదాలని సరిగ్గా ఉంచండి.
చేతులని తొడలపై ఉంచాలి.
ఇప్పుడు మెల్లగా పైకి లేవాలి.
స్లోగా పైకి లేచి కడుపు దగ్గరికి రావాలి.
మెడ బిగించకుండా చూడండి.
పైకి లేచాక నెమ్మదిగా కిందకి వెళ్లండి.
వెన్నునొప్పి
సిటప్స్ చేయడం వల్ల వచ్చే లాభాల్లో ముఖ్యమైంది నడుము, వెన్నునొప్పి తగ్గడం. దీనిని చేయడం వల్ల కోర్ స్ట్రాంగ్‌గా మారుతుంది. వెన్నునొప్పి తగ్గడం, గాయాల తాలుకూ నొప్పులు తగ్గుతాయి. సిటప్స్ని జాగ్రత్తగా చేస్తే నడుమునొప్పి, వెన్నునొప్పి రావు. వెన్నెముక స్ట్రాంగ్‌గా మారుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa