ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిపాలనలో సమూల మార్పులు తీసుకురావాలనే ఉద్దేశంతో, ఏకకాలంలో 31 మంది అఖిల భారత సర్వీసు (IAS, IPS) అధికారుల బదిలీలకు రంగం సిద్ధం చేసింది. ఈ భారీ స్థాయిలో జరిగిన బదిలీలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనాన్ని రేపుతున్నాయి.ఈ మార్పులతో అనేక కీలక శాఖలకు కొత్త నేతృత్వం లభించనుంది. కొత్తగా నియమించబడిన అధికారుల వివరాలు ఇలా ఉన్నాయి:
కుటుంబ సంక్షేమశాఖ డైరెక్టర్‌గా – చక్రధర్‌బాబు
వ్యవసాయశాఖ డైరెక్టర్‌గా – మనజీర్ జిలానీ సామున్
ఏపీపీఎస్సీ (APPSC) సెక్రటరీగా – రవిసుభాష్ఏ
పీఎస్పీడీసీఎల్ (APSPDCL) సీఎండీగా – శివశంకర్ లోతేటి
పౌరసరఫరాలశాఖ వైస్ చైర్మన్‌గా – ఎస్. ఢిల్లీరావు
ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ డైరెక్టర్‌గా – పి. రంజిత్ భాషా
రాష్ట్ర పాలనను మరింత సమర్థవంతంగా, ప్రజల అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం ఈ కీలక బదిలీలను అమలు చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa