ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తాలిబన్ విదేశాంగమంత్రి భారతలో పర్యటన.. కాబూల్‌పై పాక్ వైమానిక దాడులు

international |  Suryaa Desk  | Published : Fri, Oct 10, 2025, 11:29 AM

తాలిబన్ పాలనలోని ఆఫ్ఘనిస్థాన్‌పై పాకిస్థాన్ మెరుపు దాడులు చేసినట్లు తెలుస్తోంది. గురువారం రాత్రి ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్‌లో బాంబు పేలుళ్లు కలకలం సృష్టించాయి. తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్థాన్ (TTP) ఉగ్రవాదులే లక్ష్యంగా ఈ దాడులు జరిగినట్లు సమాచారం. ఈ దాడుల్లో టీటీపీ చీఫ్ ముఫ్తీ నూర్ మెహ్సూద్ మరణించి ఉండొచ్చని పలు అంతర్జాతీయ మీడియా వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ఆఫ్ఘనిస్థాన్ విదేశాంగమంత్రి భారత పర్యటనలో ఉన్న సమయంలో ఈ దాడులు జరగడం గమనార్హం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa