AP: అనంతపురంలో తుపాకుల సరఫరా చేస్తున్న మధ్యప్రదేశ్ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. భార్యను తుపాకీతో బెదిరించిన కేసు దర్యాప్తులో భాగంగా ఈ ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి 5 కంట్రీమేడ్ రివాల్వర్లు, 30 బుల్లెట్లు, ఒక ఖాళీ మ్యాగజైన్, ఒక తల్వార్ స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా అనంతపురం జిల్లాతో పాటు ఇతర ప్రాంతాలకు తుపాకులు సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa