ఏపీలో పీపీపీ విధానంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణంపై వివాదం నెలకొంది. వైసీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుండగా, కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఈ విధానాన్ని ప్రశంసించారు. వైబెలిటీ గ్యాప్ ఫండింగ్ లో సగం వాటాను కేంద్రం భరిస్తుందని, దేశవ్యాప్తంగా డయాలసిస్ కేంద్రాలను పీపీపీలో నడుపుతున్నామని తెలిపారు. ఈ నేపథ్యంలో వైసీపీ కేంద్రం వైఖరిపై ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. వైసీపీ అధినేత జగన్, కేంద్ర మంత్రి అభిప్రాయంతో ఏకీభవిస్తారా లేక విభేదిస్తారా అనేది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa