ఆంక్షల కారణంగా ఉత్తర అట్లాంటిక్‌లో నిలిచిపోయిన వెనెజువెలాకు చెందిన భారీ చమురు నౌకను అమెరికా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఈ ట్యాంకర్‌ను కొన్ని రోజులుగా అమెరికా సైన్యం వెంబడించి, చివరకు దాని పైకి చేరుకున్నట్లు ప్రకటించింది.లెబనాన్‌లోని హెజ్‌బొల్లా సంస్థకు సంబంధించిన ఓ కంపెనీ కోసం స్మగ్లింగ్ జరుగుతోందన్న ఆరోపణలపై ఈ నౌకను అమెరికా 2024లో నిషేధించింది. గత నెలలో వెనెజువెలా వైపు వెళ్తున్న ఈ నౌకను స్వాధీనం చేసుకోవడానికి అమెరికా కోస్ట్ గార్డ్ ప్రయత్నించింది. తప్పించుకున్న ఈ నౌక అట్లాంటిక్‌లో తిరుగుతోంది. ఈ నౌకపై కొన్ని వారాలుగా నిఘా పెట్టిన అమెరికా ఎట్టకేలకు దాని పైకి చేరుకుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa