ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రతి గ్రామానికి 10-12ఉద్యోగాలు ఇచ్చాం : జగన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Sep 30, 2019, 02:27 PM

గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాలు పొందిన వారందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. దేశ చరిత్రలో తక్కువ సమయంలో అత్యంత పారదకయర్శకంగా నిర్వహించాం.ఏపీ సీఎం జగన్  మాట్లాడుతూ ...20లక్షల పైగా అభ్యర్థులు పరీక్ష రాసి  8రోజులు పరీక్షలు పెట్టి 1లక్ష 40వేల మందికి శాశ్వత ఉద్యోగాలు రావడం రికార్డు. దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించే రికార్డు ఇదిగ్రామ వార్డు సచివాలయాల ద్వారా ప్రతి గ్రామానికి 10-12ఉద్యోగాలు ఇచ్చాం . ఇంత భారీగా ఉద్యోగాలిచ్చిన చరిత్ర దేశంలోనే లేదు. సరికొత్త రికార్డు నెలకొల్పాం


4నెలలు తిరక్క ముందే అక్షరాలా 4లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వగలిగా ఉద్యోగంగా కాకుండా ఉద్యమంగా తీసుకోవాలి. సొంత మండలంలో ఉద్యోగం చేయగలిగే అధృష్టం చాలా తక్కువ మందికే దొరుకుతుంది. సొంత మండలంలో పనిచేస్తూ సేవలందించి మంచిపేరు తీసుకురావావి చిత్తశుద్దితో,  నిజాయతిగా పారదర్శక పాలన అందించాలని అందరినీ కోరుతున్నా ప్రజలకు చేరువగా ఉంటూ సేవలందించడం కోసం ఉద్యోగం చేస్తున్నామని అందరూ గుర్తుచుకోవాలి. పారదర్శక పాలన మీరు తీసుకు వస్తారని ప్రజలంతా ఎదురు చూస్తున్నారు. లంచాలివ్వకుండా పనులు జరగని రీతిలో మన వ్యవస్థ ఉంది


 


జన్మభూమి కమిటీల పేరుతో చివరకు మరుగుదొడ్లు కావాలన్నా లంచం ఇవ్వనిదే జరగని పరిస్థితి ఉండేది. వ్యవస్థలో మార్పు తీసుకు వచ్చేందుకే గ్రామ వార్డు సచివాలయాలు తీసుకువచ్చాం . 50ఇళ్లకు ఒక వాలంటీర్ తీసుకువచ్చాం,  గ్రామ సచివాలయాల ఏర్పాటు చేశాం . వివక్ష లేకుండా , అవినీతి లేకుండా 72గంటల్లో సేవలు అందించాలి. 34డిపార్టు మెంట్లకు సంబంధించి పనులు గ్రామ వార్డు సచివాలయాల ద్వారా జరుగుతాయి. సంక్షేమ పథకాలు కేవలం 72 గంటల్లోనే అందించినపుడు పేదల్లో చిరునవ్వులు కనిపిస్తాయి. ప్రభుత్వం దృవీకరించిన విత్తనాలు, ఎరువులను  గ్రామ సచివాలయం పక్కనే షాప్ పెట్టి అందిస్తాం 


గ్రామ సచివాలయాల్లో డిసెంబర్  తొలి వారం కల్లా కంప్యూటర్లు, సహా ఇతరత్రా పరికరాలు, ఫర్నీచర్ పూర్తిగా అందుబాటులోకి తెస్తాం . జనవరి 1నుంచి దాదాపు 500 సేవలు గ్రామ సచివాలయాల్లో పూర్తిగా అందుబాటులోకి వస్తాయి. జనవరి నుంచి రేషన్ కార్డులు, పెన్షన్లు, ఆరోగ్య శ్రీ పథకాలన్నీ గ్రామ సచివాలయం పరిధిలోకి వస్తాయి. లబ్ది దారుల వివరాలను గ్రామ సచివాలాల్లో నోటీసు బోర్డులు కులాలు, మతాలు, రాజకీయాలు, పార్టీలు చూడవద్దు మనకు ఒటు వేయని వారు కూడా మనం చేసే మంచి చూసి ఒటు వేయాలి..


పారదర్శకత తో అందరకీ సంక్షేమ పథకాలు అందించాలిఅర్హులైన వారందరికీ సంక్షేమ ఫలాలు అందించాలి. ఫిర్యాదుల కోసం సీఎం పేషిలో కాల్ సెంటర్ ఏర్పాటు చేశాం 


1902 కంప్లైంట్ చేస్తే నేరుగా సీఎం పేషికి కనెక్ట్ చేసి ఫిర్యాదులు తీసుకుంటున్నాం . గ్రామ సచివాలయ ఉద్యోగులు ఎవరైనా అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాం. గ్రామ వాలంటీర్,  సచివాలయ ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వానికి రెండుకళ్లు .సమాజంలో మార్పు తీసుకురావాల్సిన బాధ్యత గ్రామ సచివాలయ ఉద్యోగుల భుజస్కందాలపై ఉంది. ఉద్యోగాలు సాధించిన 1లక్ష 35 వేల మంది అందరికీ హృదయ పూర్వక శుభాకాంక్షలు


 


పారదర్శకంగా, అవకతవకలు లేకుండా నియామకాలు చేసిన ఉన్నతాధికారులకు సెల్యూట్ చేస్తున్నా.పురపాలక, గ్రామీణాభివృద్దిశాఖ అధికారులు, ఉన్నతాధికారులు సమర్థంగా వ్యవహరించారు. రాష్ట్రంలో ప్రతి కలెక్టర్, ఎస్పీ లకు అభినందనలు తెలియజేస్తున్నా. ఉద్యోగాలు రానివారెవరూ నిరాశచెందవద్దు.అన్ని ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను జనవరిలో భర్తీ చేస్తాం






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa