భవిష్యత్ లో ప్రాంతీయ పార్టీలకు చోటు లేదని బీజేపీ ఎంపీ సుజనా చౌదరి అన్నారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ… గాంధీ సంకల్పయాత్ర విజయవంతంగా సాగుతుందని, ఏ కాలానికైనా గాంధీ సిద్ధాంతాలు ఆచరణీయమన్నారు. ప్రాంతీయ పార్టీలన్నీ కుటుంబాల చేతుల్లో ఉన్నాయని, తెలుగు రాష్టాల్లో బీజేపీ ఏ పార్టీతోను పొత్తు పెట్టుకోదన్నారు. రాజధానిపై ప్రజల్లో గందరగోళం ఉన్న మాట వాస్తవమేనని ప్రజాస్వామ్య బద్దంగా గెలిచిన ముఖ్యమంత్రి దీనిపై స్పందించాలన్నారు. రాజధానిపై జాతీయ పార్టీగా ఇప్పుడే ఏమీ స్పందించమని సుజనా చౌదరి అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa