హైదరాబాద్: తమిళనాడులో రెండేళ్ల చిన్నారి బోరు బావిలో పడ్డాడు. తిరుచురాపల్లి జిల్లాలోని నాదుకట్టుపట్టి గ్రామంలో ఈ ఘటన జరిగింది. 25 ఫీట్ల లోతైన బోరుబావిలో సుజిత్ విల్సన్ అనే బాలుడు పడ్డాడు. ఆ పిల్లవాడిని కాపాడేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇంటి వద్ద సుజిత్ ఆడుకుంటున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. చాన్నాళ్లుగా వాడని బోరుబావిలో ఆ పిల్లోడు పడిపోయాడు. శుక్రవారం రాత్రి నుంచి చిన్నారిని బయటకు తీసేందుకు తీవ్రంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa