అనంతపురం జిల్లా పెనుకొండ ఆర్టీవో చెక్‌పోస్ట్‌పై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. గత అర్ధరాత్రి ఒంటి గంట నుంచి 4:30 గంటల వరకు సోదాలు కొనసాగాయి. ఈ సోదాల్లో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ విజయకుమారి, ప్రైవేటు వ్యక్తుల దగ్గర అనధికారంగా ఉన్న రూ.31వేల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భం గా విజయకుమారితో పాటు బోయ రాము, నాగ భూషణంలపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు..
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa