ఇండోనేషియాలోని దక్షిణసుమత్రా ప్రాంతంలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగి 24 మంది మృతి చెందారు. 37 మంది ప్రయాణికులతో వెళుతున్న బస్సు అదుపుతప్పి 150 అడుగుల లోతులో ఉన్న లోయలో పడింది. ఈ ప్రమాదంలో 24 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారమందుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టి క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. 24 మంది ఒకే సారి చనిపోవడంతో అక్కడ విషాదం నెలకొంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa