ఆంధ్ర నుంచి అమ్మాయిలను తీసుకోచ్చి హైదరాబాద్ లో వ్యభిచారం చేయిస్తున్న ముఠాను సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. నిజాంపేట్‌లోని ఓ అపార్ట్మెంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్ఓటీ పోలీసులు దాడి చేసి నలుగురు మహిళలు, ఒక విటుణ్ని అరెస్టు చేశారు. నిజాంపేట్ సెట్విన్ కాలనీలోని ఓ అపార్ట్మెంట్లో వ్యభిచారం జరుగుతోందని సమాచారం రావడంతో ఎస్ఓటీ పోలీసులు దాడులు చేయగా కృష్ణ, ప్రకాశం జిల్లాలకు చెందిన నలుగురు మహిళలు, ప్లేట్ బషీరాబాద్‌కు చెందిన ఓ విటుడు రెడ్‌హ్యాండెడ్‌గా దొరికారు. అందరినీ అరెస్టు చేసి వారిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa