ఏసుక్రీస్తు పుట్టినరోజుకు గుర్తుగా భక్తిభావంతో కోట్లాదిమంది జరుపుకునే పండుగ క్రిస్మస్ అని మంత్రి కొడాలి నాని అన్నారు. ఆయన రాష్ట్ర ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.అదేవిధంగా సాటి మనుషుల పట్ల స్వార్థాన్ని వీడి ప్రేమ కలిగి జీవించమని చెప్పిన యేసుక్రీస్తు, మానవజాతికి ఆదర్శమని మంత్రి పేర్నినాని తెలిపారు. ఆయన రాష్ట్ర ప్రజలకు క్రిస్మస్ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు.
మానవాళికి జీసస్ సాటి మనుషుల పట్ల ప్రేమ, నిస్సహాయుల పట్ల కరుణ, ఆకాశమంతటి సహనం చూపించాలిని ఆయన జీవితం ద్వారా మహోన్నత సందేశాలు ఇచ్చారని తిరువూరు నియోజకవర్గం ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధి అన్నారు. అవధులు లేని త్యాగం, శాంతియుత సహజీవనం, శత్రువుల పట్లక్షమాపణ గుణం ఉండాలిని జీసస్ బోధించినట్లు ఆయన పేర్కొన్నారు. అదే విధంగా భక్తులు, ప్రజలకు క్రిస్మస్ పండగ శుభాకాంక్షలు తెలిపారు. సెయింట్‌పాల్ చర్చిలో క్రిస్మస్ వేడుకలు జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో ప్రతిపక్షనేత చంద్రబాబు, టీడీపీనేతలు పాల్గొన్నారు.
అనంతపురం: పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో వేలాది మంది విదేశిభక్తులు పాల్గొన్నారు.
నెల్లూరు:సెయింట్ జోసెఫ్ చర్చిలో క్రిస్మస్ వేడుకలు సాగుతున్నాయి. ఈ వేడుకల్లో మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ పాల్గొన్నారు. మంత్రి అనిల్ కుమార్ భక్తులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ప్రేమ, శాంతి, సంతోషాలతో కూడిన వెలుగులను ప్రజల జీవితాల్లో నింపేదే క్రిస్మస్ పండగని తెలిపారు.
చిత్తూరు:చిత్తూరు టౌన్ చర్చిలో క్రిస్మస్ వేడుకలు కొనసాగుతున్నాయి. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పాల్గొన్నారు. అదేవిధంగా ఎమ్మెల్యే భక్తులకు, ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.
గుంటూరు: జిల్లా వ్యాప్తంగా క్రిస్మస్ పండగ సందర్భంగా ఘనంగా వేడుకలు జరుగుతున్నాయి. గుంటూరు, ఫిరంగిపురం చర్చిలో ప్రత్యేక ప్రార్థనల్లో భక్తులు పాల్గొన్నారు.
విశాఖ పట్నం: జగదాంబ జంక్షన్ సెయింట్ అంథోని చర్చిలో క్రిస్మస్ వేడుకలు జరుగతున్నాయి. ప్రత్యేక ప్రార్థనలు, క్రైస్తవ భక్తిగీతలతో ప్రార్థన మందిరం కళకళలాడుతుంది. ఈ పార్థనల్లో భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.
తెలంగాణలోని పలు చర్చిల్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఆర్ధరాత్రి నుంచి చర్చిల్లో భక్తులు పార్ధనల్లో పాల్గొన్నారు. మెదక్ చర్చిలో క్రిస్మస్ వేడకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రత్యేక ప్రార్ధనల్లో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. కరీంనగర్ లుథర్, సీఎస్‌ఐ చర్చి, సికింద్రాబాద్ సెయింట్ మేరిస్ చర్చి, విజయవాడ గుణదల చర్చిలో జరుతున్న క్రిస్మస్ వేడుకల్లో భక్తులు వేలాదిగా పాల్గొని ప్రత్యేక పార్ధనలు చేస్తున్నారు.
మంచిర్యాల: సీఎస్‌ఐ చర్చిలో జరుగుతున్న క్రిస్మస్ వేడుకల్లో ఎమ్మెల్యే దివాకర్ పాల్గొని.. భక్తులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. టాల మండలంలోని విజయనగరం సీఎస్‌ఐ చర్చిలో జరగుతున్న క్రిస్మస్ వేడుకల్లో ఎమ్మెల్యే కోనేరు కోనప్ప పాల్గొన్నారు. ప్రజలు, భక్తులకు ఆయన క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా కొత్తగుడెం సీఎస్‌ఐ చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో వేలాదిగా భక్తులు పాల్గొంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa