ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైఎస్సార్ కాపు నేస్తం మార్గదర్శకాలు విడుదల

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jan 30, 2020, 12:43 PM

ఏపీ సర్కార్ వైఎస్సార్ కాపు నేస్తం పథకం అమలుకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పథకానికి కాపు మహిళలు మాత్రమే అర్హులు. ఈ పథకం ద్వారా ప్రభుత్వం కాపు మహిళలకు సంవత్సరానికి రూ.15 వేల చొప్పున ఐదు సంవత్సరాలకు రూ.75వేలు అందించనుంది. .కాపు, బలిజ, తెలగ, ఒంటరి ఉపకులాలకు వైఎస్సార్ కాపు నేస్తం పథకం వర్తించనుంది. 45 ఏళ్ల నుంచి 60ఏళ్లలోపు ఉన్న మహిళలకు ఈ సాయం అందనుంది. కాపు కులాల్లో ఉన్న పేద మహిళలను ఆదుకోవడం కోసం పెట్టిన పథకమిదని సీఎం జగన్ ప్రకటించిన విషయం తెలిసిందే. త్వరలోనే ఈ పథకానికి సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుంది.


ఈ పథకానికి అర్హతలివే


- కాపు, బలిజ, తెలగ, ఒంటరి ఉపకులాల మహిళలు అర్హులు. వారి వయస్సు 45 నుంచి 60 ఏళ్లలోపు ఉండాలి.


- గ్రామీణ ప్రాంతాల్లో నెలకు రూ.10వేలు, పట్టణ ప్రాంతాల్లో రూ.12 వేల లోపు ఆదాయం ఉన్న వారు అర్హులు. అంతకు ఎక్కువ ఉంటే అర్హులు కాదు.


- 3 ఎకరా లోపు పల్లం భూమి, 10 ఎకరాల లోపు మెట్ట భూమి ఉన్న కుటుంబాలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది.


- కారు, ట్రాక్టర్ వంటి 4 వీలర్ వాహనాలు లేని దారిద్ర రేఖకు దిగువన ఉన్న వారు మాత్రమే వైఎస్సార్ కాపు నేస్తానికి అర్హులు.


- ప్రభుత్వ ఉద్యోగం ఉన్న కాపు మహిళలు పథకానికి అనర్హులు.


- కుటుంబంలో ఎవరైనా ఆదాయ పన్ను కడుతున్నా ఆ కుటుంబంలోని మహిళలకు ఈ పథకం వర్తించదు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa