జెరుసలెం: ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ ఇజ్రాయల్ దేశాధ్యక్షుడు రూవెన్ రివ్లిన్‌ను కలుసుకున్నారు. అధ్యక్ష భవనం వెళ్లిన మోదీ అక్కడ రివ్లిన్‌తో కాసేపు ముచ్చటించారు. ఇజ్రాయల్, భారత్ మధ్య ఉన్న స్నేహసంబంధాల గురించి విస్తృత స్థాయిలో చర్చించినట్లు మోదీ చెప్పారు. ఐ ఫర్ ఐ అంటే ఇజ్రాయిల్ ఫర్ ఇండియా, ఇండియా ఫర్ ఇజ్రాయల్ అంటూ మోదీ అన్నారు. ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కొన్ని సమస్యలు గురించి కూడా ఇద్దరు నేతలు చర్చించారు. భారత్‌ను సందర్శించిన అంశాన్ని తాను ఎప్పటికీ మరిచిపోలేను అని ఇజ్రాయల్ అధ్యక్షుడు రివ్లిన్ అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa