ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జీఎస్‌టీ మొబైల్‌ యాప్‌ ప్రారంభం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jul 08, 2017, 02:47 PM

 కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన వస్తు, సేవల పన్ను(జీఎస్‌టీ) రేట్లపై వినియోగదారుల సందేహాలను నివృత్తి చేసేందుకు కేంద్రప్రభుత్వం మొబైల్‌ యాప్‌ను శనివారం ప్రారంభించింది. ‘జీఎస్‌టీ రేట్‌ ఫైండర్‌’ పేరుతో సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ ఎక్సైజ్‌ అండ్‌ కస్టమ్స్‌(సీబీఈసీ) ఈ మొబైల్‌ యాప్‌ను తీసుకువచ్చినట్లు అధికారికంగా ప్రకటించింది. దీని ద్వారా ఏయే వస్తువులపై ఏ పరిధిలో ఎంత పన్ను విధిస్తున్నారనే పూర్తి సమాచారాన్ని వినియోగదారులు తెలుసుకోవచ్చు. అన్ని ఆండ్రాయిడ్‌ ఫోన్ల ద్వారా ఈ మొబైల్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. డౌన్‌లోడ్‌ చేసుకున్న తర్వాత ఆఫ్‌లైన్‌ మోడ్‌లోనూ ఈ యాప్‌ పనిచేస్తుంది.


ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం జీఎస్‌టీపై సందేహాలు, అనుమానాలు తీర్చేందుకు హెల్ప్‌లైన్‌ నంబర్‌ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇందు కోసం ప్రత్యేకంగా 60 కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఒకే దేశం- ఒకే పన్ను నినాదంతో కేంద్ర ప్రభుత్వం జీఎస్‌టీను జులై 1 నుంచి అమల్లోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa