ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవులను ప్రకటించింది. మహమ్మారి బారిన పడిన ప్రభుత్వ, ప్రైవేటు రంగ ఉద్యోగులకు 28 రోజుల పాటు వేతనంతో కూడిన సెలవులను ప్రకటించింది. ఈ మేరకు అధికారులు ఉత్తర్వులు విడుదల చేశారు. గత ఏడాది కూడా ఉత్తరప్రదేశ్‌లో కోవిడ్-19 మహమ్మారి ఇలాగే విజృంభించింది. దీంతో అప్పట్లో కూడా కరోనా సోకిన ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవులను ప్రకటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa