ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎల్ఐసీలో ఉద్యోగాలకు దరఖాస్తు.. రేపే చివరి తేదీ..

national |  Suryaa Desk  | Published : Sun, Jun 06, 2021, 12:23 PM

ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ "ఎల్ఐసీ" పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఎల్ఐసీ హౌజింగ్ ఫైనాన్స్‌ లిమిటెడ్ విభాగంలో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇందులో భాగంగా మొత్తం 6 ఖాళీలను రిక్రూట్ చేయనున్నారు. ఈ ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులు ఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరు, భోపాల్‌, ముంబయి బ్రాంచ్‌లలో పనిచేయాల్సి ఉంటుంది. దరఖాస్తుల ప్రక్రియ రేపటితో ముగియనున్ననేపథ్యలో నోటిఫికేషన్‌పై ఓ లుక్కేయండి..


అర్హతలు..


* అభ్యర్థులు సోషల్ వర్క్‌/రూరల్ మేనెజ్‌మెంట్ విభాగంలో కనీసం 55 శాతం మార్కులతో డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. డిస్టెన్స్ లెర్నింగ్‌, పార్ట్‌టైమ్‌, కరస్పాండెంట్ కోర్సులు చేసిన వారి ఈ పోస్టులకు అనర్హులు.


* ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు జనవరి 1, 2021 నాటికి 23 నుంచి 30 ఏళ్ల మధ్యలో ఉండాలి.


* సంబంధిత విభాగంలో ఏడాది అనుభవం తప్పనిసరి.


ముఖ్యమైన విషయాలు..


* ఆన్‌లైన్ అప్లికేషన్ల ప్రక్రియ మే 24న ప్రారంభంకాగా.. జూన్ 7న (రేపటితో) ముగియనుంది.


* దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను ఆనలైన్ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.


* ఎంపికైన అభ్యర్థులకు ఏడాదికి రూ. 6 నుంచి రూ. 9 లక్షల వరకు జీతంగా అందిస్తారు.


* పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి..






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa