రక్షణ కల్పించాల్సిన పోలీసులే దోపిడీకి పాల్పడ్డ ఘటన యూపీలోని మథురలో చోటు చేసుకుంది. ఆగ్రా- మథుర హైవేపై ఉన్న ఓ టోల్ ప్లాజాలోకి చొరబడ్డ నలుగురు పోలీసులు సిబ్బందిని బెదిరించి 40వేల నగదు దోచుకెళ్లారు. అంతేకాదు అడ్డం వచ్చిన సిబ్బందిపై దాడికి దిగారు. నిన్న రాత్రి 11.45 సమయంలో ఈ ఘటన జరిగినట్లు టోల్ ప్లాజా సిబ్బంది చెబుతున్నారు. తమ వాహనానికి మరో వాహనం తగిలిందనే ఆరోపణలతో గొడవ ప్రారంభించిన పోలీసులు ఒక్కసారిగా సిబ్బందిపై దాడికి దిగారు. ఆ తర్వాత కౌంటర్ లో నగదును దోచుకెళ్లారు. ఈ ఘటనంతా సీసీటీవీలో రికార్డయింది. దీంతో ఫుటేజ్ ఆధారంగా ఉన్నతాధికారులకు టోల్ ప్లాజా యాజమాన్యం ఫిర్యాదు చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa