విశాఖపట్నం: మాకవరపాలెం మండలం జి. కోడూరు గ్రామ సమీపంలో పోలీసులు ఆదివారం సాయంత్రం పేకాట శిబిరంపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఐదుగురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ రామకృష్ణ తెలిపారు. వారి వద్ద నుంచి59, 270 రూపాయల నగదు 8 బైకులు, 5 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేశామన్నారు. పేకాట జూదం కోడిపందాలు తదితర అసాంఘిక కార్యకలాపాలకు ప్రజలు దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. లేకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa