న్యూ ఇయర్ రోజే తీవ్ర విషాదం నెలకొంది. జమ్మూకశ్మీర్ లోని వైష్ణో దేవి ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 12 మంది భక్తులు ప్రాణాలు కోల్పోగా మరి కొంత మందికి గాయాలు అయ్యాయి. నూతన సంవత్సరం సందర్భంగా ఆలయానికి భక్తులు పోటెత్తడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.2లక్షలు, క్షతగాత్రులకు రూ.50వేల చొప్పున ప్రధాని పరిహారం ప్రకటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa