నెల్లూరు జిల్లా సంఘం నుంచి బెస్తరపేట కు అక్రమంగా తరలిస్తున్న ఇసుక లారీలను హనుమంతునిపాడు మండలం హాజీపురం క్రాస్ రోడ్ వద్ద పట్టుకున్నట్లు హనుమంతునిపాడు ఎస్ ఐ జి కృష్ణ పావని తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆదివారం సాధారణ తనిఖీల్లో భాగంగా హాజీపురం అడ్డరోడ్డు వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా సరైన పత్రాలు లేకుండా అక్రమంగా తరలిస్తున్న ఇసుక లారీని పట్టుకున్నట్లు ఆమె తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa