రష్యా, ఉక్రేయిన్ దేశాల యుద్ధాన్ని ఆపాలని అనంతపురం జిల్లా హిందూపురం పట్టణంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉక్రేయిన్ లో ప్రజలు భయ బ్రాంతులకు గురి అవుతు ప్రాణాలు అరచేతులలో పెట్టుకొని బిక్కు బిక్కు మని బ్రతుకుతున్నారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ప్రపంచ వ్యాప్తంగా శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందన్నారు.
ప్రతి దేశం రష్యా, ఉక్రేయిన్ ల మధ్య శాంతియుత చర్చలు జరిగేల ప్రయత్నించి మారణహోమాన్ని అపే దిశగా అడుగులు వేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ నాగేంద్ర కుమార్, లైఫ్ వరల్డ్ ఉదయ్ కుమార్, చైతన్య గంగిరెడ్డి, డి. రమేష్, నవీన్, బి. యస్. పి శ్రీరాములు, మనోజ్ , ఓబులేసు, శ్రీరాములు, నాగార్జున, హరి, లక్ష్మి నారాయణ, కోడూరు చంద్రమౌళి, శ్రీనివాసులు, అంబేద్కర్ నగర్ శివ, శ్యాంబాబు, పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa