ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరంలో ఉన్న భారతీయులకు కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. తక్షణమే కీవ్ నగరాన్ని వదిలి పెట్టాలని ఆదేశించింది. కీవ్ నగరంలో ఏ క్షణమైనా ఏదైనా జరగొచ్చని హెచ్చరించింది. ఎలాగైనా కీవ్ నగరం నుంచి బయటపడాలని సూచించింది. సీ-17 విమానాలను ఉక్రెయిన్ పంపాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఉక్రెయిన్ లోని భారతీయులను తక్షణం తరలించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa