అనంతపురం: నాసన్ కంపనీ కోసం భూములు కోల్పోయిన రైతులకు మద్దతుగా నిలిచిన సిపిఎం నాయకులను అరెస్ట్ చేయడం తగదని, అరెస్ట్ చేసిన సీపీఎం నాయకులను వెంటనే విడుదల చేయాలని కోరుతూ చిలమత్తూరు మండల సీపీఎం నాయకులు తహసీల్దార్ రంగనాయకులకు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా నాయకులు ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ భూములు కోల్పోయిన రైతులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇవ్వాలని 2013 లో భూసేకరణ చట్టం స్పష్టంగా చెప్తోందన్నారు. అయితే అదేమి పట్టించుకోకుండా ప్రభుత్వం ముందుకెళుతోందన్నారు. ఈ పరిస్థితుల్లో అన్యాయవ అవుతున్న రైతులకు మద్దతుగా పాలసముద్రం వద్ద ఉన్న నాసన్ కంపెనీ వద్దకు వెళ్లి నిరసన చేపట్టిన నాయకులను అమాన కషంగా అరెస్ట్ చేసి స్టేషన్కి తరలించడం హేయమైన చర్యని వారు అభివర్ణించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa