జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలోని ఓ ఆస్పత్రిలో మంగళవారం గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో పలువురు గాయపడ్డారు.పోలీసు వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. అనంత్‌నాగ్‌లోని మెటర్నిటీ అండ్ చైల్డ్ కేర్ హాస్పిటల్ (ఎంసీసీహెచ్)లో ఈ ఘటన చోటుచేసుకుంది.ఆసుపత్రి సెక్షన్‌లో గ్యాస్ సిలిండర్ లీకేజీ కారణంగా పేలుడు సంభవించిందని అధికారి తెలిపారు.“ఈ ఘటనలో కొంతమంది ఆసుపత్రి ఉద్యోగులతో సహా పలువురు గాయపడ్డారు.గాయపడిన వారిని అనంత్‌నాగ్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa