దేశ రాజధాని ఢిల్లీకి ఆనుకుని ఉన్న గురుగ్రామ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.అతివేగంతో అదుపుతప్పిన ఓ కారు నడిరోడ్డుపై బీభత్సం సృష్టించింది. రెండు బైక్‌లపై వెళ్తున్న స్విగ్గీ డెలివరీ బాయ్స్‌పైకి దూసుకళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురు యువకులు మరణించారు. గురుగ్రామ్‌లోని గోల్ఫ్ కోర్స్ రోడ్డులో ప్రమాదం చోటుచేసుకుంది. ఒక్కో బైక్‌పై ఇద్దరు డెలివరీ బాయ్స్ ఉన్నారు. రెండు బైక్‌లపై మొత్తం నలుగురు వెళ్తుండగా.. ఓ స్కోడా కారు అతివేగంతో దూసుకొచ్చిది.. వాటిని ఢీకొట్టింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆ నలుగురు యువకులు అక్కడికక్కడే మరణించారు.ప్రమాదంలో బైక్‌లు నుజ్జునుజ్జయ్యాయి. కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమయింది. అర్ధరాత్రి తర్వాత ఈ ప్రమాదం జరగినట్లుగా పోలీసులు చెబుతున్నారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. కారు డ్రైవర్‌ని అదుపులోకి తీసుకొని.. కారును స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై దర్యాప్తు జరుగుతున్నట్లు వెల్లడించారు. ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa