భారత్, శ్రీలంక జట్ల మధ్య శుక్రవారం నుంచి తొలి టెస్ట్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కెప్టెన్ గా రోహిత్ శర్మకి ఫస్ట్ మ్యాచ్ కాగా విరాట్ కోహ్లీ ఆటగాడిగా 100వ మ్యాచ్. ఈ నేపథ్యంలో ఈ టెస్టు సిరీస్‌తో నమోదుకానున్న పలు రికార్డులను ఇప్పుడు తెలుసుకుందాం.
నమోదు కానున్న రికార్డులు ఇవే..
- ఈ సిరీస్ ఇండియాలో జరుగుతోంది కాబట్టి ఇండియాపై శ్రీలంక గెలిస్తే భారత్ గడ్డపై తొలి టెస్టు విజయం నమోదు చేసినట్టు అవుతుంది.
- ఐసీసీ పురుషుల టెస్టు టీమ్ ర్యాంకింగ్స్‌లో భారత్ ప్రస్తుతం మూడో స్థానంలో ఉంది. ఈ సిరీస్ గెలిస్తే టాప్ కి వెళ్లే అవకాశం ఉంది.
- విరాట్ కోహ్లీ తన కెరీర్లో 71వ సెంచరీ కోసం ఎదురుచూస్తున్నాడు. ఒకవేళ ఈ టెస్టులో సెంచరీ చేస్తే పాటింగ్ రికార్డును సమం చేస్తాడు. వీరిద్దరి కంటే ముందు సచిన్ 100 సెంచరీలతో టాప్ లో ఉన్నాడు.
- విరాట్ కోహ్లీ తన టెస్టు కెరీర్లో 8000 పరుగుల మార్కును సాధించడానికి కేవలం 38 పరుగుల దూరంలో ఉన్నాడు.
- ఈ సిరీస్‌లో కోహ్లీ 2 సెంచరీలు చేస్తే తన టెస్టు కెరీర్లో సెంచరీల సంఖ్య 29కు చేరుకుంటుంది. దీంతో సర్ బ్రాడ్‌మన్‌తో సమానమవుతాడు.
- శ్రీలంకపై భారత్ జట్టు వరుసగా ఏడో టెస్టులో విజయం సాధించాలని ఆశిస్తోంది. గత 3 టెస్టు మ్యాచుల్లో విజయం సాధించిన శ్రీలంక జట్టు వరుసగా నాలుగో మ్యాచ్ లోనూ గెలవాలని చూస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa